NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పూలే జయంతి ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి

1 min read

వెలుగోడు, న్యూస్​ నేడు: భారతీయ సంఘసంస్కర్త , ఉపాధ్యాయురాలు,రచయిత్రి , నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే భార్యసావిత్రి బాయి పూలే 195 వ  జయంతిని పురస్కరించుకొని శనివారం వెలుగోడు పట్టణంలోని గ్రంధాలయం నందు ఆ శాఖధికారిని ఎన్. వి సుమలత ఆధ్వర్యంలో చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు. జాతీయ బి. సి. సంక్షేమ సంఘము రాష్ట్ర కార్యదర్శి ఎస్. రఘు రాముడు యాదవ్ ,మాజీ సర్పంచ్, టిడిపి మండల అధ్యక్షులు అబ్దుల్ కలాం , లిటిల్ ఏంజిల్స్ పాఠశాల కరస్పాండంట్ డా. ఇమ్మానియెల్ మాట్లాడుతూ కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని నిర్మించిన దార్మిక ప్రధాత , ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె,కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసిన దిశాలి. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ సింహ స్వప్నం.పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిని అని కొనియాడారు. సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని , మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వర రావు ,బలుసా రాము , పేపర్ ఏజంట్ శివుడు మండల పరిషత్ ఉపాధ్యక్షులు శివ శంకర్ నాయక్ , రాఘవేంద్ర ,   తదితరులు పాల్గొన్నారు.

About Author