భూ హక్కుల భద్రతకు కొత్త పుస్తకాలు కీలకం
1 min read
మహానంది, న్యూస్ నేడు : భూ హక్కుల భద్రతకు కొత్త పట్టాదారు పుస్తకాలు ఎంతో కీలకమని కేసికెనాల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బన్నురు రామలింగారెడ్డి అన్నారు.శనివారం మహానంది మండల పరిధిలోని మసీదుపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నరాల మౌళీశ్వర రెడ్డి అధ్యక్షతన డిప్యూటీ తహశీల్దార్ కామేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు కొత్త పట్టాదారు పుస్తకాలను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈకార్యక్రమంలో వి ఆర్ ఓ నరసింహ, తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

