జ్ఞాన సుందరి నాటకానికి సహకరించిన జై భీమ్ సభ్యులకు కృతజ్ఞతలు
1 min read
: ఎరిగేరి దళిత నాయకులు
కౌతాళం, న్యూస్ నేడు: జై భీమ్ వ్యవస్థాపకులు అవతారం సర్పంచ్ పాల్ దినకర్ గజమాలతో సత్కరించిన ఎరిగేరి సి.ఎస్.ఐ సంఘ పెద్దలు, గత నెల డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని జ్ఞాన సుందరి నాటకాన్ని ఎరిగేరి దళిత నాయకులు ప్రదర్శించడం జరిగింది. ఆ నాటకానికి సహకరించిన జై భీమ్ వ్యవస్థాపకులు అవతారం,సర్పంచ్ పాల్ దినకర్, బాపురం జయపాల్,ఎరిగేరి సంఘ పెద్దలు మరియు దళిత నాయకులు గజమాలతో సత్కరించడం జరిగింది. జ్ఞాన సుందరి నాటకం విజయవంతం కావడం పట్ల గ్రామస్తులు హర్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వసంత్, సల్మాన్ , నాగేంద్ర, మాజీ ఎస్ఎఫ్ఐ వీరేష్, రాజు, అయ్యప్ప, గ్రామస్తులు పాల్గొన్నారు.

