NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అటవీ శాఖ విభాగానికి క్యాంప పథకం ద్వారా13 వాహనాలు

1 min read

ఏపీ ప్రభుత్వ సహకారంతో వాహనాలు కొనుగోలు

క్షేత్రస్థాయిలో వేగవంతమైన పర్యవేక్షణకు వాహనాలు దోహదపడతాయి

జిల్లా అటవీ శాఖ అధికారులు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు  అటవీ విభాగంలో ( క్యాంప)పథకం ద్వారా 13 వాహనాలు కొనుగోలు చేసి యున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి  నిరంతర ప్రోత్సాహంతో  క్యాంప  పథకం కింద ఏలూరు  అటవీ విభాగానికి (టెరిటోరియల్  మరియు వైల్డ్ లైఫ్ విభాగములకు ) మొత్తం 13 వాహనాలు కొనుగోలు చేయడం జరిగింది.అటవీ సంరక్షణ, అటవీ రక్షణ, అగ్నిప్రమాదాల నియంత్రణ, అక్రమ చెట్లు కొట్టివేత నివారణ, వన్యప్రాణుల సంరక్షణ, అలాగే క్షేత్రస్థాయిలో వేగవంతమైన పర్యవేక్షణ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ వాహనాలు ఎంతో దోహదపడతాయి. ఈ వాహనాల ద్వారా అటవీ అధికారులు మరియు సిబ్బంది దూర ప్రాంతాలకు సులభంగా చేరుకొని తమ విధులను సమర్థంగా నిర్వర్తించగలుగుతారు.ప్రజల భాగస్వామ్యంతో అటవీ వనరుల పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక ముఖ్యమైన అడుగు. క్యాంప నిధులను సద్వినియోగం చేస్తూ అటవీ పరిరక్షణ కార్యక్రమాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం రాష్ట్రప్రభుత్వం  అటవీశాఖ కు ఇస్తున్న ప్రధాన్యతకు నిదర్శనం అని జిల్లా అటవీశాఖాధికారి వారు పేర్కొన్నారు.

About Author