NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మినీ గోకులం షెడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

1 min read

జువ్వాజీ సుంకన్న సేవలు ఎనలేనివి

నందికొట్కూరు, న్యూస్​ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని 10 బొల్లవరం గ్రామంలో(పల్లె పండుగ 2.0) రెండు లక్షలతో రైతు నూతనంగా నిర్మించిన మినీ గోకులం షెడ్డును నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య శుక్రవారం ఉదయం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.రైతులకు ఎల్లవేళలా ప్రభుత్వం ఆదుకుంటుందని గోకులం షెడ్డును రైతులు ఉపయోగించుకోవాలని అన్నారు.ముఖ్యమంత్రి సహాయ నిధి బొగ్గుల రాధికకు -41,084 రూ.ల చెక్కును అందజేశారు.ఆ తర్వాత నందికొట్కూరు పట్టణం పటేల్ సెంటర్ లో జువ్వాజీ సుంకన్న గౌడ్ 138 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే, మున్సిపాలిటీ కమిషనర్ వెంకటరామిరెడ్డి నివాళులు అర్పించారు.ఆయన చేసిన సేవల గురించి ఎమ్మెల్యే కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి,జనసేన పార్టీ ఇంచార్జ్ నల్లమల్ల రవి కుమార్,కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి,సాయిరాం కాలేజీ అధినేత సుధాకర్ రెడ్డి,శ్రీకాంత్ గౌడ్,కుమార్ గౌడ్,సీఐలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, సుబ్రహ్మణ్యం మరియు డాక్టర్ వనజ తదితరులు పాల్గొన్నారు.

About Author