NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సహకార ఉద్యోగుల సమ్మె కు మాజీ సర్పంచ్ మద్దతు

1 min read

వెలుగోడు, న్యూస్​ నేడు: తమ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న  సహకార సంఘ ఉద్యోగుల సమ్మె కు  వెలుగోడు గ్రామ మాజీ సర్పంచ్ ముల్లా అబ్దుల్ కలాం మద్ధతు తెలిపారు. ఏపీ పిఎసి ఎస్ జేఏసీ రాష్ట్ర ఉద్యోగ సంఘాల పిలుపుమేరకు  వెలుగోడు బ్రాంచ్ పరిధిలోని సహకార సంఘాల ఉద్యోగులు   నిరవధిక సమ్మెలో శుక్రవారం పాల్గొనడం జరిగినది, వారు చేస్తున్న సమ్మె 5వ రోజుకు చేరింది. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గతం లో ఇచ్చినటువంటి జి.ఓ .నం 36 ను వెంటనే అమలు చేసి , జీతాలను పెంచాలని , అలాగే 2014 పే స్కేలు పిక్సెషన్ జరగనందున , పే ఫిక్సేషన్ వెంటనే అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో మాదిరిగానే వయసు 62 సంవత్సరాలకు పెంచాలని ,  అదేవిధంగా హెచ్ ఆర్ పాలసీని అమలు చేయాలని , సంఘము లాభనష్టాలతో సంబంధం లేకుండా జీతాలను చెల్లించాలని, ఎస్ఎల్ఈసి. లేదా డిఎల్ఈసి ల ద్వారా కమిటీలను ఏర్పాటు చేసి ట్రాన్స్ఫర్లు జరపాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 2019 తర్వాత చేరిన ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని , సహకార సంఘ ఉద్యోగులకు డ్యూటీలో ఉండగా మరణించినట్లయితే వారి కుటుంబానికి 20 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని చెల్లించాలని ,  ఉద్యోగం నుంచి విరమణ పొందిన తర్వాత గ్రాడ్యుటీ కనీసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని , రైతు పంట రుణాలను సహకార సంఘాల ద్వారానే ఇచ్చే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.  ప్రభుత్వం దిగివచ్చి మా న్యాయమైన కోరికలు తీర్చని యెడల ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనుకాడబొమని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఈఓలు కృష్ణమోహన్ , ముర్తుజావలి, గోపాల్,  జంబులయ్య  మరియు సిబ్బంది  రాము నాయక్ , కిరణ్ కుమార్ ,  సురేష్ రెడ్డి , శ్రీకాంత, జనార్ధన్ ఆచారి, ప్రసాద్, పవన్ కళ్యాణ్ రెడ్డి , రామకృష్ణుడు, శివకుమార్ , షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.

About Author