NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వచ్ఛ సంక్రాంతి- ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల పై దృష్టి

1 min read

పంచాయతీ అభివృద్ధి అధికారి ఎన్ రవి కిషోర్

 ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశాలతో గ్రామంలో పారిశుద్ధ్య , అభివృద్ధి పనులు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: డిసెంబర్ 26 నుండి జనవరి 10వ తేది వరకు రాష్టం అంతటా గ్రామాల్లో స్వచ్ఛ సంక్రాంతి- ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమలలో భాగంగా శుక్రవారం నాడు,పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమలను చేపట్టడం జరిగింది,ఇందులో భాగంగా గ్రామంలోని  వీధులలో రోడ్లన్నీ శుభ్రం చేసి, రోడ్డు కిరువైపులా గార్బజ్ హెప్స్ తొలగించి,డ్రైనేజీ లలో సిల్ట్ తొలగించి, సున్నం & బ్లీచింగ్, మాలదియాన్ ద్రావణాన్ని పిచికారీ చేపించి గ్రామాన్ని చెత్త రహిత గ్రామంగా మార్చేందుకు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశాలతో  స్థానిక కూటమి నాయకుల సహకారంతో కృషి చేస్తున్నట్లు పంచాయతీ అభివృద్ధి పనులు చేపట్లన్నట్లు పంచాయితీ అధికారి ఎన్. రవి కిషోర్ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పోలిశెట్టి వీరయ్య,చందు గంగాధరావు, పామర్తి శ్రీనివాసరావు, జగదీశ్, బూత్ కన్వీనరు పి.వెంకట్,వెల్ఫేర్ మురళి, డి.ఎ.తేజ గుమస్తా ఎం.కామేష్, మిగతా సిబ్బంది, స్వచ్చందంగా ప్రజలు పాల్గొన్నారు.

About Author