NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఐదవ రోజు కొనసాగిన సహకార సంఘం ఉద్యోగుల రిలే దీక్షలు 

1 min read

సహకార సంఘం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి

పత్తికొండ, న్యూస్​ నేడు:  తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ, పత్తికొండ పట్టణంలోని స్థానిక కే డి సి సి బ్యాంక్ ఎదురుగా సహకార సంఘం ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి ఐదవ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా దీక్ష శిబిరానికి హాజరైన సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి రవిచంద్ర దీక్షలో కూర్చున్న సహకార సంఘం ఉద్యోగులకు పూలమాలలు వేసి శిబిరాన్ని ప్రారంభించారు. సహకార సంఘం ఉద్యోగులకు గత ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే 36 జీవోను విడుదల చేస్తే నేటి వరకు అది అమలు చేయడంలో ప్రభుత్వాలు జాప్యం చేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం వచ్చినా సహకార సంఘం ఉద్యోగులతో వెట్టిచాకిరి చేయించడం తప్ప వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైతున్నాయని అన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో నిరవధిక సమ్మెలు దీక్షలకు పూనుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడిందని, చిరుద్యోగులపైన ప్రభుత్వాలు ఇలాంటి ధోరణి అవలంబిస్తే రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో నిజాయితీగా విధులు నిర్వహించే ఉద్యోగులకు ఆత్మహత్యలే శరణ్యం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే 36 జీవని వెంటనే అమలు చేసి వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచాలని 2019 తర్వాత ఉద్యోగంలో చేరిన వారిని వెంటనే రెగ్యులర్ చేయాలని ప్రమాద బీమా ఆరోగ్య భీమా వర్తింప చేయాలని గ్రాడ్యుయేటి అమలు చేయాలని లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో సహకార సంఘం ఉద్యోగులకు అండగా నిలబడి ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ దీక్షలకు మండల పరిధిలోని గ్రామాల రైతులు.

About Author