NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రాలయంలో  లాడ్జిల దగ్గర పార్కింగ్ తప్పని సరి

1 min read

లాడ్జిల నిర్వహకులకు హెచ్చరిక

 మంత్రాలయం సిఐ రామాంజులు

మంత్రాలయం న్యూస్ నేడు :   మంత్రాలయంలోని లాడ్జ్ నిర్వాహకులు  లాడ్జిల లో రూములు అద్దేకు తీసుకునే భక్తుల  వాహనాలకు లాడ్జిల దగ్గర పార్కింగ్ స్థలం తప్పని సరిగా ఉండాలని మంత్రాలయం సిఐ రామాంజులు హెచ్చరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ  లాడ్జ్ లో బస చేయడానికి వచ్చిన భక్తుల యొక్క పూర్తి చిరునామా వివరాలను తీసుకోవాలని సూచించారు.    లాడ్జి నిర్వాహకులు భక్తుల నుంచి  బలవంతపు వసూలు చేసినట్లు పోలీసుల దృష్టికి వచ్చిన అటువంటి లాడ్జి పై కఠిన చర్యలు తీసుకొని వారి యొక్క లాడ్జిలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.   లాడ్జి యొక్క యజమానులు వారి లాడ్జిలను సరైన నియమ నిబంధనలు పాటిస్తూ  అనుమతులు ఇవ్వాలి తప్ప సరైన నియమ నిబంధనలు పాటించని యెడల లాడ్జి యజమానులపై క్రిమినల్ కేసులు చేయడం జరుగుతుందని సూచించారు.   లాడ్జి యొక్క ఎంట్రీ, ఎగ్జిట్ ప్రదేశాలలో మరియు లాడ్జి చుట్టుపక్కల సీసీటీవీ  కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు.   జాతీయ రహదారి పక్కన ఉన్న లాడ్జి యజమానులు  రహదారిలో వాహనాలను ఆపకుండా చూడాలన్నారు. సరైన చిరునామా వివరాలను నమోదు చేయని లాడ్జిల పైన చట్ట పరమైన  చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.  లాడ్జి నిర్వాహకులు వారి యొక్క లాడ్జి ముందర అనుమతులు లేకుండా హోటల్స్ కానీ టీ కొట్టులు గాని పెట్టి  భక్తులకు గాని ప్రజలకు గాని ఇబ్బందులకు గురి చేస్తే వాటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

About Author