NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తరలించొద్దు తరలించొద్దు సాయి హాస్టల్ – క్రీడా సంఘాల డిమాండ్.

1 min read

కర్నూల్ స్పోర్ట్స్ న్యూస్ : శనివారం కర్నూల్ నగరంలో స్థానిక డిఎస్ఏ అవుట్డోర్ స్టేడియం నందు ఉన్న మేజర్ ధ్యాన్ చంద్ కాంస్య విగ్రహానికి  పూలమాల వేసి వినతి పత్రాన్ని క్రీడా సంఘాలు అందించడం జరిగింది. అనంతరం క్రీడా సంఘ పెద్దలు మాట్లాడుతూ 25 సంవత్సరాల నుండి ఎంతోమంది క్రీడాకారులను స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా తీర్చిదిద్దడం జరిగిందని, అలాగే అనేకమంది క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలియజేశారు, అటువంటి క్రీడా ట్రైనింగ్ సెంటర్ ను ఇక్కడినుండి తరలించడం అన్యామని, అలాగే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం వెనక్కి తీసుకున్నంత వరకు క్రీడా సంఘాల్లో నిరంతరం పోరాడుతూనే ఉంటాయని అవసరమైతే చట్టపరమైన పోరాటానికైనా సిద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ కే నాగరత్నమయ్య, స్కేటింగ్ శిక్షకుడు సునీల్, సాఫ్ట్ బాల్ సెక్రెటరీ గంగాధర్, విలువిద్య సంఘం కోశాధికారి మురళీ మోహన్ రావు, నెట్ బాల్ సంఘం కన్వీనర్ బి విజయ్ కృష్ణారావు,  అత్య పత్య కార్యదర్శి జయపాల్, వ్యాయామ ఉపాధ్యాయుడు చరణ్, న్యాయవాది ఈదుల బాలాజీ రెడ్డి, జేఏసీ నాయకుడు దినకర్, సీనియర్ బాస్కెట్బాల్ ప్లేయర్ నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *