NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కార్మిక వ్యతిరేక చట్టాల జీవో కుల ప్రతులను దగ్ధం చేసిన కార్మికులు 

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాల ప్రతులను సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం సంక్రాంతి భోగిమంటల్లో దగ్ధం చేశారు. పత్తికొండ పట్టణంలో  స్థానిక మడ్డి గేరి నందు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుజ్జులు , సికామని, ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టాన్ని మార్చి విబి జి రాంజీ పేరున కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాల జీవోలను  భోగి మంటలలో వేసి నిరసన తెలిపారు. అలాగే పట్టణంలోని  స్థానిక అంబేద్కర్ సర్కిల్ నందు సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర, ఆధ్వర్యంలో 29 చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లుగా  తీసుకువచ్చిన జీవోలను  భోగిమంటల్లో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో వలసలు వెళ్లకుండా నియంత్రించాలన్న సదుద్దేశంతో వామపక్షాల ఆధ్వర్యంలో చేసిన పోరాటాల వల్ల 2005 లో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టం రూపకల్పన చెందిందని అది కాస్త విబి జి రాంజీ పేరుతో పతకంగా మార్చడం అలాగే 29 చట్టాలను రద్దుచేసి చికాగో నగరంలో కార్మికుల రక్తంలో నుండి పుట్టిన ఎనిమిది గంటల పని విధానాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకువచ్చిన జీవోలను మాకు వద్దు అంటూ భోగిమంటల్లో కాల్చి వేయడం జరిగిందని ఇలాంటి జీవోలను  కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోకుంటే దేశవ్యాప్తంగా కార్మికులు కర్షకుల ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేపట్టడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఉరుకుందు, రామాంజనేయులు, బజారు హమాలీలు గ్రామీణ ఉపాధి హామీ పథకం మహిళలు పాల్గొన్నారు.

About Author