NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంక్రాంతి సందర్భంగా వైభవంగా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

1 min read

హోళగుందన్యూస్ నేడు: సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మండల ప్రధాన కార్యదర్శి ఈ. గోవిందు గౌడ్  సహకారంతో, యువ నాయకుడు ఈ. రాజేంద్ర గౌడ్  ఆధ్వర్యంలో హెచ్ పి ఎల్ హోళగుంద ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను  బుధవారం వైభవంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సై మారుతి , యువ నాయకులు రాజేంద్ర గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్,భువనేష్ గౌడ్,వీరన గౌడ్,మైనార్టీ మండల అధ్యక్షులు ముల్ల మోయిన్, జనసేన కన్వీనర్ అశోక్,సిద్ధప్ప,మల్లి,తిక్క స్వామి, షాలి అమాన్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా యువకులు గెలుపోటములతో కాకుండా  క్రీడా స్ఫూర్తితో ఆడాలని,అన్నారు.ఈ టోర్నమెంట్ విజేతలకు మొదటి బహుమతి రూ.10000 రూపాయలు,రెండవ బహుమతి రూ.5000 రూపాయలు ఈ.గోవింద్ గౌడ్ అందించనున్నారు.

About Author