NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉపాధి హామీ  చట్ట సవరణ బిల్లు పేదలపై దాడి..

1 min read

కొత్త చట్టపు జీవోలను భోగిమంటల్లో దగ్ధం…

పత్తికొండ, న్యూస్​ నేడు: కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సవరణలు చేసి, వి బి జి రామ్ జి పేరుతో చేసిన కొత్త చట్టం భవిష్యత్తులో గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా పేదలకు అందని ద్రాక్షగా ఉంటుందని  చట్ట సవరణ పేదలపై దాడి లాంటిదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్ పేర్కొన్నారు.ఉపాధి హామీ పథకం చట్ట సవరణ బిల్లు ను వ్యతిరేకిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బుధవారం నాడు భోగి సందర్భంగా  దేవనకొండ మండలంలో దేవనకొండ ,కుంకునూరు, తెర్నేకల్ గ్రామాలలో నూతన చట్టపు జీవోలను భోగి మంటలలో దగ్ధం చేశారు ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి ఎత్తివేయాలని కుట్రలో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించి వి బి జి  రామ్ జి గా పేరు మార్పు చేయడానికి పూనుకుందని దేశ స్వాతంత్రం కోసం సర్వస్వం త్యాగం చేసిన మహాత్మా గాంధీ  పేరు తొలగించడం పై గాంధీ పట్ల బిజెపి వైఖరి స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నారు , ఉపాధి జీవించే హక్కులో భాగమని గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించేందుకు 2005లో పలు రాజకీయ పార్టీలు, వ్యవసాయ, రైతు కార్మిక సంఘాలు  ఒత్తిడి మేరకు యూపీఏ ప్రభుత్వం ఆనాడు చట్టం చేయడం జరిగిందని, వీటి మూలంగా గత 20 సంవత్సరాలుగా వ్యవసాయ కార్మికులు వలసలు వెళ్లకుండా తామున్న గ్రామంలోనే ఉపాధి పనులు చేసుకునేందుకు అవకాశం ఏర్పడిందని అటువంటి చట్టాన్ని నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతుందన్నారు ,ఇప్పటివరకు కేంద్రం 90% నిధులు ఇస్తుండగా దానిని 60 శాతానికి కుదించిందని మిగిలిన 40 శాతం భారాన్ని.

About Author