NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిజాయతీకి దక్కిన విజయం.. చంద్రబాబుపై కేసు కొట్టివేత హర్షణీయ

1 min read

హోళగుందన్యూస్ నేడు : ప్రజాస్వామ్యానికి ఇది శుభపరిణామం న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకం పెరిగింది.చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూసిన శక్తులకు ఈ తీర్పు ఒక చెంపపెట్టుచంద్రబాబు నాయుడు దశాబ్దాల రాజకీయజీవితం మచ్చలేనిది  టీడీపీ మండల మైనారిటీ అధ్యక్షుడు ముల్లా మోయిన్తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయ కక్షతో గత ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసును గౌరవ న్యాయస్థానం కొట్టివేయడం ప్రజాస్వామ్య విజయమని టీడీపీ మండల మైనారిటీ అధ్యక్షుడు  ముల్లా మోయిన్  పేర్కొన్నారు. ఈ తీర్పు న్యాయవ్యవస్థపై సామాన్య ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని మరోసారి చాటిచెప్పిందనినిరూపించిందని ఆయన తెలిపారు.ఆయన కొనియాడారు. చంద్రబాబు నాయుడు దశాబ్దాల రాజకీయ జీవితం మచ్చలేనిదని, ఆయన పాలన అవినీతికి ఆమడ దూరంలో ఉంటుందని ముల్లా మోయిన్  స్పష్టం చేశారు. “కేవలం రాజకీయంగా దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే గత ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసి, అక్రమ కేసులతో వేధించింది. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా చివరికి సత్యమే జయించింది” అని ఆయన విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూసిన శక్తులకు ఈ తీర్పు ఒక చెంపపెట్టు అని ముల్లా మోయిన్ అన్నారు. అబద్దపు కేసులతో ప్రత్యర్థులను అణచివేయా లని చూసే వారికి ప్రజాస్వామ్యంలో స్థానం లేదని హెచ్చరించారు. ఈ తీర్పుతో చంద్రబాబు నాయకత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకం మరింత బలపడిందని, న్యాయస్థానాలు ఎప్పుడూ సత్యం పక్షానే ఉంటాయని ఈ ఘటనేనిరూపించిందని ఆయన తెలిపారు.

About Author