విజయపాల డైరీ ఆధ్వర్యంలో సంక్రాంతి కానుక
1 min read

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా విజయ డైరీ సహకార సంఘం చైర్మన్ ఇమకంటి విష్ణువర్ధన్ రెడ్డి మరియు డైరెక్టర్ల ఆధ్వర్యంలోవిజయ పాల డైరీకి పాలు పోసే యజమానులకు సంక్రాంతి కానుక బహుమతులను అందజేశారు.గ్రామంలో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి హాజరై పాలు పోసే రైతులకు సంక్రాంతి కానుకగా స్టీల్ టిఫిన్ బాక్సులను కమిటీ సభ్యులతో కలిసి బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా కాతా రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ“పాల రైతులే గ్రామానికి అసలైన బలంవారి కష్టాన్ని గుర్తించి, గౌరవిస్తూ ఇలాంటి ఉపయోగకరమైన కార్యక్రమాలు ముందుకూ కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కుంచ పుల్లారెడ్డి,ఈ రమేష్ రెడ్డి, నందికొట్కూరు తాలూకా తెలుగు యువత అధ్యక్షులు దేరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,మర్రి కుంట మహేశ్వర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి, పాల డైరీ అధికారి హుస్సేన్ మియా,మౌలాలి మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

