NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్సీ ,ఎస్టీ కేసు పై డిఎస్పీ భార్గవి విచారణ

1 min read

మంత్రాలయం న్యూస్ నేడు : మండల పరిధిలోని బూదురు గ్రామంలో గత ఏడాది డిసెంబర్ 31 తేదిన  చికెన్ షాప్ దగ్గర చాకలి నరేష్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన రామతీర్థం , చిన్న ,గాబ్రియేల్  విజయ లపై కత్తితో దాడి చేశాడు. చాకలి నరేష్ పై మంత్రాలయం పోలీసు స్టేషన్ లో  ఎస్టీ ఎస్సీ కేసు నమోదు చేశారు. అందులో భాగంగా బుధవారం ఎమ్మిగనూరు డిఎస్పీ భార్గవి  , సిఐ రామాంజులు‌  బూదురు గ్రామానికి చేరుకొని దాడి సంబంధించిన దానిపై ప్రత్యక్ష సాక్ష్యులను  విచారణ చేపట్టారు. గ్రామంలో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఈ నివేదికను ఉన్నతాధికారులకు అందజేయడం  జరుగుతుందని పోలీసులు తెలిపారు.  ఈ విచారణ లో మంత్రాలయం ఎస్ఐ మల్లికార్జున , పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

About Author