NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశైలంలో నిత్య కళారాధన …

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:         దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈ రోజు (17.01.2026)   శ్రీ జి.డి. ఫణికుమార్ మరియు వారి బృందం. గూడూరు, కృష్ణా జిల్లా  వారిచే వారిచే వేణుగానం కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి     ఈ  వేణుగానం ఏర్పాటు చేయబడింది.ఈ కార్యక్రమములో మహాగణపతిం, భో…శంభో, నమశ్శివాయతే, శంభో శంకరా తదితర గీతాలను వేణుగానం చేయనున్నారు. ఈ కార్యక్రమములో  వయోలిన్ సహకారాన్ని శ్రీ పెరవలి నందకుమార్, మృదంగ సహకారాన్ని శ్రీ జి. సురేష్‌బాబు అందించనున్నారు. అలాగే రెండవ కార్యక్రమములో భాగంగా  ఎస్. నటరాజడాన్సు అకాడమీ,  కడప వారిచే  సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.కాగా   ఈ నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

About Author