కర్నూలు ను స్మార్ట్ సిటీ గా రూపొందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి
1 min read

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
కర్నూలు , న్యూస్ నేడు : కర్నూలు ను స్మార్ట్ సిటీ గా రూపొందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు.శనివారం జిల్లా కలెక్టర్ కర్నూలు స్మార్ట్ సిటీ కి సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రాజ విహార్, బళ్లారి చౌరస్తా దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణాలకు, చెన్నై – సూరత్ ఎక్స్ప్రెస్ వే తో నగరానికి బైపాస్ తో అనుసంధానం కు చెందిన సర్వేలను పూర్తి స్థాయి లో చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగ కర్నూలు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడంపై అధికారులతో సమీక్షించారు.వెంకటరమణ కాలనీకి 24 గంటల నీటి సరఫరాకు సంబంధించిన పైలెట్ ప్రాజెక్టు, నీటి సరఫరా, పైప్లైన్ ల ఏర్పాటు, కర్నూలు నగరంలో ప్రవహిస్తున్న తుంగభద్రా నది , హంద్రీ నది , కేసీ కాలువల సుందరీకరణ పనులపై అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే రోడ్డు విస్తరణ అంశాలపై చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ , ఎస్.ఇ. రమణమూర్తి , ఇ.ఇ. మనోహర్ రెడ్డి , ఆర్ అండ్ బి డిఇ ఫణి రామ్ , టిపిఓ అంజాద్ భాష , కేఎంసి డెవలప్మెంట్ డైరెక్టర్ లు క్షత్ర పతి రెడ్డి , సందీప్ కుమార్ ,సాయీమ్ , నేషనల్ హైవే ఇంజనీర్లు శ్రీనివాసులు , వరుణ్ పాల్గొన్నారు.

