పి.జి. మూడవ సెమిస్టర్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: రాయలసీమ యూనివర్సిటీ కాలేజీలో జరుగుతున్న పి.జి. మూడవ సెమిస్టర్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని వర్సిటీ వైస్‌ఛాన్సులర్ ఆచార్య వి. వెంకట బసవరావు సూచించారు. వర్సిటీలో ఈ నెల 8వ తేదీనుండి ప్రారంభమైన మూడవ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న విధానాన్ని ఆయన పరిశీలించారు. పరీక్షలు జరుగుతున్నతీరుపట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. ఈరోజు జరిగిన పరీక్షలకు490 మందికి గాను474మంది హాజరయ్యారన్నారు. ఆయనతోపాటు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయకుమార్ నాయుడు, వర్సిటీ కాలేజి ప్రిన్సిపాల్ మరియు పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ ఆచార్య సి. విశ్వనాథరెడ్డి తదితరులు ఉన్నారు.

