పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి
1 min read

పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒక వరమని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి అన్నరు.
ఆదోని , న్యూస్ నేడు: మంగళ వారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 55 మంది లబ్ధిదారులకు 22,59,030 /- (టోటల్ అమౌంట్ ) రూపాయలు చెక్కుల ద్వారా అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి మాట్లాడుతూ ఆదోని నియోజకవర్గం ప్రజలపై వారి ఆరోగ్య పట్ల ప్రేమను చూపుతున్నటువంటి ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు కి ఆదోని నియోజకవర్గం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా పేదల ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో నియోజకవర్గం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎప్పుడు అప్లికేషన్లు పెట్టిన వెంటనే శాంక్షన్ చేసి పేద ప్రజలకు అద్దిస్తున్నందుకు ఆదోని నియోజకవర్గం ప్రజలు ఎల్లప్పుడూ ముఖ్యమంత్రి ని ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కులమతాలు పార్టీలకతీతంగా తమను సంప్రదిస్తే మీ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యకు పరిష్కార మార్గం చూపుతానని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి తెలియజేశారు.

