పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం పథకాలు సమర్థవంతంగా అమలు కావాలి
1 min read

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
కర్నూలు , న్యూస్ నేడు : పీఎం సూర్య ఘర్ , పీఎం కుసుం పథకాలు సమర్థవంతంగా అమలు కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారులను ఆదేశించారు.రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పీఎం సూర్య ఘర్ , పీఎం కుసుం, తదితర అంశాలపై సీఎస్ సమీక్షించారు..ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి హాజరయ్యారు.పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం, పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం గురించి సీఎస్ కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఈ అంశాల్లో జిల్లాలో జరుగుతున్న పురోగతి గురించి వివరించారు. పి ఎం సూర్యఘర్, పీఎం కుసుం పథకాల అమలుకు సంబంధించి వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.సమావేశంలో నెడ్ కాప్ డెవలప్మెంట్ ఆఫీసర్ వీరేంద్ర , ట్రాన్స్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాయి ఈశ్వర్ రెడ్డి ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఏపి ఎస్ పి డి సి ఎల్ ఎస్.ఇ ప్రదీప్ కుమార్ , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు డిప్యూటీ ఇంజనీర్లు కర్నూలు నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

