ప్రజలందరూ ‘పురమిత్ర’ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి
1 min read

నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
కర్నూలు, న్యూస్ నేడు: బుధవారం నగర పౌరులు అరచేతిలో నగరపాలక సేవలు పొందవచ్చని నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నగరాలు, పట్టణాల ప్రజల సౌకర్యార్థం, స్థానిక సమస్యలకు సులువుగా పరిష్కారం పొందేందుకు వీలుగా ‘పురమిత్ర’ యాప్‌ను రూపొందించిందని తెలిపారు. నగరపాలకకు సంబంధించిన సమస్త సేవలను కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా, సులువుగా పరిశుభ్రత, తాగునీరు, లైటింగ్, డ్రైనేజీ సమస్యలు, రోడ్లపై గుంతలు వంటి అంశాలను ఈ యాప్ ద్వారా తెలియజేస్తే మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.

