NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది 

1 min read

ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆ పన్నులను ఆదుకుంటున్నాం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: అవసరార్థులకు తక్షణ వైద్యసేవలు అందించడంతో పాటూ వారికి ఆర్ధిక భరోసా కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఇదేక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆపన్నులను ఆదుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పంపిణీ చేశారు. మొత్తం 19 మందికి మంజూరైన 6లక్షల, 97వేల, 991 రూపాయల చెక్కులతో పాటూ, 4లక్షల, 71వేల, 118 రూపాయల విలువైన రెండు ఎల్‌వోసి కాపీలను బాధితులకు అందజేసిన ఆయన  వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలరని వెల్లడించారు. దానిలో భాగంగానే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటివరకూ 441 మందికి 4కోట్ల, 30లక్షల, 79వేల, 979 రూపాయల సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణీ చేసినట్లు స్పష్టం చేశారు. అత్యవసరమైన వైద్యసేవలతో పాటూ, ఖరీదైన శస్త్ర చికిత్సలను పొందిన పేదలకు ఆర్ధిక భరోసా కల్పించే లక్ష్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, ఎఎంసి చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్ధసారధి, టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంచార్జిలు, డివిజన్ ఇంచార్జిలు మరియు వివిధ హోదాలలో ఉన్న టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author