పార్టీ బలోపేతం కోసం సచివాలయాల క్లస్టర్ కమిటీల ఏర్పాటు
1 min read

పత్తికొండ, న్యూస్ నేడు: వైయస్సార్సీపి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సచివాలయాన్ని ఒక క్లస్టర్‌గా తీసుకొని కమిటీల నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం ఆమె స్వగృహంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు.ప్రతి కమిటీలో పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేసే నిబద్ధత గల నాయకులు, కార్యకర్తలకు తప్పనిసరిగా అవకాశం కల్పించాలని సూచించారు. కేవలం పదవుల కోసమే కాకుండా, ప్రజల మధ్య ఉండి పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసేవారికే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.గ్రామస్థాయి నుంచి పట్టణస్థాయి వరకు సంస్థాగతంగా వైఎస్ఆర్ పార్టీని మరింత పటిష్టంగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేలా ప్రతి కమిటీ పనిచేయాలని ఆమె అన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ నాయకులు, ఎంపీపీ,మండల కన్వీనర్, పట్టణ నాయకులు, మైనార్టీ సోదరులు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

