దాడి చేసిన వారిపై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేయాలి
1 min read

మాల మహానాడు నాయకులు యాట ఓబులేష్,చరణ్ తేజ డిమాండ్
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని ఉప్పలదడియా గ్రామంలో దళితులపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నందికొట్కూరు మాల మహానాడు నాయకులు యాట ఓబులేష్,చరణ్ తేజ డిమాండ్ చేశారు.గురువారంమధ్యాహ్నం నందికొట్కూరు పట్టణంలో బాధితులతో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ సీఎం చర్చి ఆవరణంలో పనిచేస్తూ చెత్తను కాలుస్తున్న సందర్భంలో అనుకోకుండా నిప్పురవ్వలు గాలికి ఎగిరి పక్కనే ఉన్న వరి గడ్డి వాము మీద పడడంతో వాము అంటుకుంది.నష్టపరిహారం చెల్లిస్తామని దళిత కుటుంబానికి చెందిన దేవా సురేష్,మధు చెబుతున్నా వినకుండా అదే గ్రామానికి చెందిన బీసీ కులస్తులైన పెద్ద ఉశేనయ్య కుమారుడు రాము కట్టెలతో దాడి చేయడం దుర్మార్గమని నిందితులపై వెంటనే చరలు తీసుకోవాలన్నారు. దళితులపై దాడులు చేస్తే సహించే ప్రసక్తే లేదని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు సంఘం నాయకులు మల్లయ్య, స్వామిదాస్, ఏసన్న,శివ,మౌలి,శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

