శ్రీశైలం ..బంగారు తాళి బొట్లు సమర్పణ
1 min read

శ్రీశైలం, న్యూస్ నేడు: శ్రీ చెన్నుపాటి తిరుపతిరావు, ఉయ్యూరు, కృష్ణా జిల్లా వారు 78 గ్రాములతో తయారు చేయించిన బంగారు తాళిబొట్లను దేవస్థానమునకు సమర్పించారు. అమ్మవారి ఆలయప్రాంగణంలోని ఆశీర్వచనమండపంలో దాతలు ఈ బంగారు తాళిబొట్లను పర్యవేక్షకులు జి. రవికుమార్, సంబంధిత సిబ్బందికి అందజేయడం జరిగింది. అనంతరం వీరికి తగు రశీదును అందజేసి వేదాశీర్వచనముతో శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు అందజేయడం జరిగింది.

