NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలు, పిల్లలకు మెరుగైన సేవలందించాలి 

1 min read

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి

కర్నూలు , న్యూస్​ నేడు : అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, పిల్లలకు మెరుగైన సేవలందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో కర్నూలు డివిజన్ కు సంబంధించిన కోడుమూరు, వెల్దుర్తి, కర్నూలు ప్రాజెక్ట్ లకు సంబంధించిన మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి డివిజనల్ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.. ఈ సమావేశంలో సిడిపిఓ లు, సూపర్వైజర్ లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  అంగన్వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పిల్లలు కూడా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పిల్లలకు  మంచి పౌష్టిక ఆహారాన్ని అందించాలని,  అలాగే ఆ పిల్లలు ఇంటి దగ్గర కూడా మంచి పౌష్టికాహారం తీసుకునేలాగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు.ప్రీ స్కూల్ విద్య కు సంబంధించి మంచి వీడియో లను తయారు చేయాలని ఐసిడిఎస్ పిడిని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలను నిర్దేశించిన సమయానికి  తెరవాలని కలెక్టర్ ఆదేశించారు. అంగన్వాడీ పిల్లలను స్వంత పిల్లల్లా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు.టేక్ హోమ్ రేషన్ తీసుకునేటప్పుడు  ఎక్స్పైరీ డేట్ ను పరిశీలించుకోవాలని, ఎక్స్పైరీ డేట్ దాటినవి తీసుకోరాదని, అలాంటివి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఇవ్వకూడదని కలెక్టర్ అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు. అంగన్వాడీ ద్వారా అందే సేవలపై గర్భిణీ స్త్రీలు, పిల్లల తల్లిదండ్రుల నుండి మంచి ఫీడ్ బ్యాక్ రావాలని కలెక్టర్ ఆదేశించారు.సమావేశంలో ఐసిడిఎస్ పిడి విజయ, సిడిపివోలు  అనురాధ, విజయ లక్ష్మి, కోఆర్డినేటర్ బాలు, సూపర్వైజర్లు , అంగన్వాడీ టీచర్లు  తదితరులు పాల్గొన్నారు.

About Author