NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేసే వరకు పోరాడుతాం

1 min read

జిల్లా ఎంఎస్పీ అధికార ప్రతినిధి ఇంచార్జి కోట ప్రభాకర్ డిమాండ్

నందికొట్కూరు, న్యూస్​ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని ఉప్పలదడియ గ్రామంలో దళిత దేవా సురేష్ పై దాడి చేసిన నిందితుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసే వరకు పోరాడుతామని నంద్యాల జిల్లా ఎంఎస్పి అధికార ప్రతినిధి మరియు నందికొట్కూరు ఎంఆర్పిఎస్ ఇన్చార్జి కోట ప్రభాకర్ మాదిగ డిమాండ్ చేశారు.దేవ సురేష్ తప్పు లేకపోయినా రక్తం కారే విధంగా కొట్టి వికలాంగుడైన తమ్మడపల్లె మధును కూడా  ఎంత ఆపినా వినకుండ  బొంగు కర్రతో ఘోరంగా కొట్టిన చాకలి రాముపై ఇంతవరకు ఎస్సీ అటాసిటీ కేసు నమోదు చేయలేదని.నా తప్పులేదు నేను కాదు అంటించింది నా ఆరోగ్యం కూడా  బాగాలేదు  నన్ను కొట్టకు అని బ్రతిమిలాడిన వినకుండా రక్తం కారే విధంగా దాడి జరిగి నాలుగు రోజులు అవుతున్నా కేసు కట్టకుండా కాలయాపన చేస్తున్నారన్నారు.  అగ్ర కులాల వారందరూ కలిసి దళితుడైన దేవ సురేష్ కి న్యాయం చేయకుండా అడ్డుపడుతున్నారు.ఈ విధంగా దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించకపోతే పదేపదే దళితుల పైన దాడులు జరుగుతూనే ఉంటాయి కాబట్టి వెంటనే రాముపై కేసు నమోదు చేయాలని కోట ప్రభాకర్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు  వెంకటరత్నం , మిడుతూరు మండల ఇన్చార్జి భూపనుపాడు సతీష్,వెంకటరమణ మాదిగ, మిడ్తూరు మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు గద్దల ఆనంద్ మాదిగ, పాములపాడు శ్రీనివాసులు  మాదిగ,మాల మహానాడు నాయకులు డేవిడ్,రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author