మహిళల భద్రత కు పటిష్ట చర్యలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు కర్నూల్ నాల్గవ పట్టణ సీఐ విక్రమ సింహ , ఈగల్ టీం హెడ్ కానిస్టేబుల్ ఎలిషా డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన కార్యక్రమము నిర్వహించారు.GMSKలు మరియు ఈగల్ బృందంతో కలిసి కల్లూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు .మహిళలపై జరిగే అఘాయిత్యాలు మరియు మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి విద్యార్థులకు తెలియజేశారు.ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే వారి భద్రత కోసం డయల్ 100, 112, 1930 వంటి హెల్ప్‌లైన్ నంబర్లుకు గాని, స్థానిక పోలీసులకు గాని సమాచారం అందించాలని వివరించారు.అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించినప్పుడు వెంటనే టోల్ ఫ్రీ 1972కి సమాచారమివ్వాలని సూచించారు.మత్తు పదార్థాల వల్ల వచ్చే నష్టాలు వాటి నుంచి ఏ విధంగా బయటపడాలి అనే కరపత్రములతో విద్యార్థులకు “Say No To Drugs” ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో Eagle సిబ్బంది, సచివాలయం మహిళా పోలీసులు కర్నూల్ 4 పట్టణ సిబ్బంది స్కూల్ యాజమాన్యం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

