NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డా. సాయి సుధీర్  నిబద్ధత కార్యదక్షతకు  గుర్తింపే యూనివర్సిటీ రిజిస్ట్రార్ పదవి..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె చిట్టి నరసమ్మ…… డా. సాయి సుధీర్ కు ఘనమైన సన్మానం,వీడ్కోలు..   ఫోరెన్సిక్ మెడిసిన్,ట్యాక్సీకాలజీ విభాగాదిపతి, మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సాయి సుధీర్  పనిలో నిబద్ధత మరియు వారి కార్యదక్షతకు గుర్తింపుగానే రాష్ట్రస్థాయిలో  ఉన్నత  పదవి అయిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్టర్ గా అవకాశం లభించిందని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ అన్నారు. సన్మాన గ్రహీత డాక్టర్ సాయి సుధీర్ మాట్లాడుతూ రిజిస్ట్రార్ గా పదవి బాధ్యతను మరింతగా పెంచిందని కర్నూల్ మెడికల్ కాలేజీ తనకు జన్మస్థానం లాంటిదని తన కుటుంబములో అనేకమంది ఇదే  కాలేజీలో చదివారని తాను ఇక్కడే చదివానని సహచర కొలీగ్స్ తో కూడా ఎమోషనల్ బాండింగ్ ఉందని అది ఎప్పటికీ మరువలేనని అన్నారు. రిజిస్టర్ గా యూనివర్సిటీ పేరును నిలబెడతానని ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ పేరుని తేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజినల్ ఐ హాస్పిటల్స్ సూపర్డెంట్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్, వైస్ ప్రిన్సిపల్, కమ్యూనిటీ మెడిషన్ విభాగాధిపతి డాక్టర్ సింధియా శుభప్రద, వివిధ విభాగాల విభాధిపతులు డాక్టర్ శ్రీరాములు, డాక్టర్ శ్రీనివాసులు డాక్టర్ రేవతి, డాక్టర్ రాజేష్, డాక్టర్ బాలిస్వరి, డాక్టర్ శివకుమార్, డాక్టర్ కిరణ్మయి,డా. సుధీర్, డాక్టర్ మోహన్ రెడ్డి, డా. రామకృష్ణ్ నాయక్, డాక్టర్ అనంత్,  డాక్టర్ ముత్యశ్రీ, డాక్టర్ రామ్ బాలాజీ నాయక్ డాక్టర్ ఎస్ లక్ష్మి, ఏపీ జిడిఏ ప్రెసిడెంట్ డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

About Author