NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పరిసరాల పరిశుభ్రత నిరంతర ప్రక్రియ గా కొనసాగాలి

1 min read

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్

పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు

స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించిన నగరపాలక సంస్థ కమిషనర్ భాను ప్రతాప్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్వచ్ఛతే ఆరోగ్య ప్రదాయినీ అని, పరిసరాల పరిశుభ్రత అనేది నిరంతర ప్రక్రియ అని ఏలూరు ఎంపి పుట్టా మహేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఇందుకు ప్రతీఒక్కరూ తమవంతుగా సహకారం అందించాలని ఆయన సూచించారు. ఏలూరు సత్రంపాడులోని ఎన్టీ రామారావు విగ్రహం వద్ద శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు ఎంపి పుట్టా మహేష్‌ కుమార్‌, ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసి విజయవాడ జోన్‌ – 2 చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభకు హాజరైనవారందరితో కార్పొరేషన్‌ కమిషనర్‌ భానుప్రతాప్‌ స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎంపి పుట్టా మహేష్‌ మాట్లాడుతూ ఎవరికి వారు తమ ఇంటిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటారో అదేవిధంగా పరిసరాలను కూడా ఉంచాలన్న స్ఫూర్తితో ముందడుగు వేస్తే స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర సాధ్యపడుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ సత్రంపాడులో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారని, కార్యక్రమంలో ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, డిప్యూటి మేయర్‌ కర్రి శ్రీనివాస్‌, ఏలూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం,క్లస్టర్ ఇంచార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, కో క్లస్టర్ ఇంచార్జ్ ఆర్ఎన్ఆర్ రాజేశ్వరరావు,21వ డివిజన్ ఇంచార్జ్ అట్లూరి రామకృష్ణ,22వ డివిజన్ ఇంచార్జ్ కొండే రాణి నిర్మల కుమారి నాయకులు అన్నపనేని రవికుమార్‌, వేల్పుల అరుణ, కుమార్‌,లంకపల్లి మాణిక్యాలరావు,ఏలూరు ఆర్డీవో అచ్యుత అంబరీష్‌, ఏలూరు అర్బన్‌ తహశీల్దార్‌ గాయత్రీ దేవి తదితరులు పాల్గొన్నారు.

About Author