ఆర్యూ అంతర్ కళాశాలల క్రికెట్ విజేత శంకరాస్ డిగ్రీ కళాశాల
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: రాయలసీమ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈనెల 21 నుండి 23 వ తారీకు వరకు ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం నందు యూనివర్సిటీ అంతర్ కళాశాలల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ పోటీల నందు కర్నూలు శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల క్రికెట్ జట్టు ఫైనల్లో శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కళాశాలపై విజయం సాధించి రాయలసీమ యూనివర్సిటీ నిర్వహించిన ఐసిటి టోర్నమెంట్ కప్పును అందుకోవడం జరిగింది. రాయలసీమ యూనివర్సిటీ క్రికెట్ విజేత శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల జట్టును కళాశాల డైరెక్టర్ డాక్టర్ బి.హరికిషన్ అభినందించడం జరిగింది. డాక్టర్ బి హరికిషన్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి ఆటను ప్రదర్శించి ఉన్నతమైన శిఖరాలకు వెళ్లాలని ఆయన ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా సౌత్ జోన్ జట్టులో శంకరాస్ డిగ్రీ కళాశాల నుంచి నలుగురు విద్యార్థులు సెలెక్ట్ కావడం అభినందనీయమని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అడ్వైజర్ శ్రీనివాసులు, ప్రిన్సిపల్ మద్దిలేటి, తెలుగు అధ్యాపకులు మద్దయ్య, ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొని కళాశాల క్రికెట్ జట్టును అభినందించడం జరిగింది.


