డీపీఈపీ పాఠశాలలో ఎన్వీబీడీసీపీ అవగాహన
1 min read

పత్తికొండ, న్యూస్ నేడు: మంగళవారం స్థానిక డీపీఈపీ పాఠశాలలో ఎన్వీబీడీసీపీ (NVBDCP – జాతీయ కీటకజన్య వ్యాధుల నియంత్రణ కార్యక్రమం) ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించింది. అందులో భాగంగా విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, డెంగ్యూ, మలేరియా, చికున్గునియా, జపనీస్ ఎన్సెఫలైటిస్ (జేఈ), ఫైలేరియా వంటి వ్యాధుల గురించి వివరంగా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీ వెంకటేశ్వర్లు , ఎంపిహెఎ శ్రీ రమేష్ బాబు హాజరై విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణపై విలువైన సూచనలు అందించారు. అలాగే ప్రధానోపాధ్యాయురాలు బేబీ నిర్మల, ఉపాధ్యాయులు శ్రీ సత్యనారాయణ, పద్మలత, శైలభాను, శాంతాబాయి ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు మరియు సిబ్బంది కీటకజన్య వ్యాధుల నివారణపై అవగాహన పెంపొందించుకున్నారు.

