NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భక్తుల కొంగు బంగారం సిద్ధేశ్వర స్వామి

1 min read

నేటి నుంచి ఉత్సవాలు

28న మహా రథోత్సవం

తరలి రానున్న ఆంధ్ర, కర్ణాటక భక్తులు

హోళగుందన్యూస్ నేడు: హొళగుందభక్తుల కొంగు బంగారంగా సిద్ధేశ్వర స్వామి విరాజిల్లుతున్నారు. స్వామి ఉత్సవాలకు ఈనెల 23న కంకణధారణతో శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ప్రజల ఆరాధ్య దైవంగా పూజింపబడుతున్నారు.ఈనెల 26వ తేదీన నంది ఉత్సవం, 27న గజోత్స వం, 28న బుధవారం రాత్రి మహా రథోత్సవం, 29న లంకాదహనం, 30న వసంతోత్సవంతో ఉత్స వాలు ముగుస్తాయని ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు రాజపంపన్నగౌడ్, శివన్నగౌడ, సిద్దా ర్థగౌడ్, హరీష్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా సిద్దే శ్వర స్వామి అభివృద్ధి సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదానం చేయనున్నారు.హొళగుందలోని సిద్ధేశ్వరస్వామి ఆలయంఅలరించనున్న సాంస్కృతిక కార్యక్రమాలు.ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 28న స్థానిక బస్టాం డులో ‘వీర అభిమాన్యు కాళగ ‘ అర్దాత్ జయద్రతన వద అనే బయలు నాటకంతో పాటు ఇతర నాటక కార్యక్రమాలు జరగనున్నాయి. 29న గడినాడ కన్నడ కళా యువక సంఘం ఆధ్వర్యంలో తేరు బజారులో స్థానిక కళాకారులతో ‘కూడి బాళీదరే స్వర్గ సుఖ’ అనే కన్నడ సామాజిక నాటకాన్ని ప్రదర్శించనున్నారు.29వ తేదీన జరిగే లంకాదహనం రోజు వివిధ రకాల బాణా సంచా కాల్చనున్నారు. కార్యక్రమాన్ని తిలకించడానికి అన్ని వర్గాల ప్రజలు తరలివస్తారు. ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి హాజరుకాను న్నారు. చిన్నారుల కోలాటాలు, రాతి గుండు, ఇసుక బస్తాలు ఎత్తే ప్రదర్శనలు నిర్వహించను న్నారు. ఉత్సవాలకు ఆలూరు సీఐ వెంకట చలపతి ఆధ్వర్యంలో హొళగుంద ఎస్ఐ దిలీప్కుమార్, నియోజకవర్గంలోని ఆయా మండలాల ఎస్ఐలు, సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు.

About Author