NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు సత్కారం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఏపీ హంస నగర అధ్యక్షులు గోవిందు ఆధ్వర్యంలో ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ వి జవహర్లాల్ ని మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సి కాశన్న ని ఇటీవల నూతనంగా ఎన్నికైనందుకు మర్యాదపూర్వకముగా షాలువతో పూలమాలతో సత్కరించడం జరిగినది.ఈ సందర్భంగా మెడికల్ ఎంప్లాయిస్ సంబంధించి వివిధ సమస్యలను జిల్లా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా కార్యవర్గానికి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వి జవహర్లాల్  మాట్లాడుతూ మా పరిధిలో ఉన్న సమస్యలను ఏవైనా సరే పరిష్కారం దిశగా ముందుకు పోతాము పై స్థాయి సమస్యలను రాష్ట్ర సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ కి మరియు ప్రధాన కార్యదర్శి డివి రమణ  దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగినది. భవిష్యత్తులో ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ తో కలిసి నడుస్తామని హంస సంఘం వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హంస నగర కార్యదర్శి  చక్రీధర్ ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి కోశాధికారి నాయుడు జిల్లా సంయుక్త కార్యదర్శి కెసిహెచ్ కృష్ణుడు, నగర ఉపాధ్యక్షుడు సాయిరాం కోశాధికారి హరికృష్ణ గౌడ్, మరియు హంస నాయకులు మరియు ఇతర మెడికల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

About Author