దేవనకొండ మండలం లో విస్తృతంగా అప్టా సభ్యత్వ నమోదు
1 min read

దేవనకొండ, న్యూస్ నేడు: దేవనకొండ మండలం లో నేడు ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ( ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు కాకి ప్రకాష్ రావు, కర్నూలు జిల్లా ఆప్టా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, కోడుమూరు మండలం ఆప్టా అధ్యక్షుడు ప్రసాదు , జిల్లా నాయకులు చెన్నకేశవులు ఆధర్వ్యం లో కప్పత్రాళ్ళ,జిల్లేడుబుడకల, కరివేముల, పాలకుర్తి, తెర్నకల్, దేవనకొండ మరియు కొత్తపేట గ్రామాల్లో విస్తృతంగా సభ్యత్వ నమోదు కార్యక్రమము నిర్వహించారు. ఉపాధ్యాయ సంఘాల యందు ఉపాధ్యాయ సమస్యల పై నిరంతరం పోరాడుతున్న ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) కు రోజు రోజూ కు ఉపాధ్యాయుల యందు ఆదరణ పెరుగుతుందని అందువలన స్వచ్ఛందంగా సభ్యులు గా చేరుతున్నారు అని రాష్ట్ర అధ్యక్షుడు కాకి ప్రకాష్ రావు తెలిపారు. ఉపాధ్యాయులు తమ కు వచ్చే వృత్తి పరమైన సమస్య ల పై ఎప్పుడూ అయిన ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ రావు ను 9849229829 కు , ఆప్టా జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి 9704040543 , ఆప్టా జిల్లా ప్రధాన కార్యదర్శి సేవా లాల్ నాయక్ 9550855099 ను సంప్రదించ వచ్చని చెప్పారు. సీనియర్ ఉపాద్యాయుల కు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి, పాత పెన్షన్ విధానం ను పునరుద్ధరణ చేయాలని ఫిబ్రవరి 5 తేదీన ఛలో డిల్లీ విజయవంతం చేయాలని జిల్లా యందలి ఉపాద్యాయులు విజయవంతం చేయాలని ఆప్టా నేతలు కోరారు.

