NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రసాభాసగా సాగిన రంగస్థల కళాకారుల సమావేశం..

1 min read

అసంపూర్తిగా ముగిసింది…..

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలు నగరం నందలి తెలుగు తోటలో కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం,  సభ్యుల, ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 11 గంటలకు జరిగిన అత్యవసర సమావేశం, రస బసగా జరిగింది.  సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు, ప్రస్తుత అధ్యక్షులు గుర్రపు శాల అంకయ్య ప్రతి ప్రశ్నను దాటవేస్తూ అసహనంగా, సమాధానాలు తెలిపారు.  సభ్యులు అడిగిన ఆర్థిక దావాదేవీల విషయంలోనూ, నాలుగు సంవత్సరాల కార్యక్రమాల నిర్వహణలోనూ, ఎలాంటి పారదర్శక పాటించక, తనకు తానే ఏకధాటిగా తన నిర్ణయాలతో అస్తవ్యస్తంగా నిర్వహణ జరిపి,  సభ్యులు, వివి రమణారెడ్డి, పి హనుమంతరావు చౌదరి, డిఎన్వి సుబ్బయ్య, కళాప్రియ తిరుపాలు, గాండ్ల లక్ష్మన్న, కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల సంక్షేమ సంఘం క్షేమం కోరి ప్రశ్నిస్తే, ప్రతి ప్రశ్నను దాటవేస్తూ అసహనంగా సమాధానాలు ఇవ్వడం జరిగింది.తనకు సహకరించనిసభ్యులు వివి రమణారెడ్డి, పి హనుమంతరావు చౌదరి, తనే ఏకపక్షంగా, సంఘం నుండి తొలగించాలని, గుర్రపుసాల అంకయ్య  అన్నారు. ఎవరు ఏమి చెప్పినా తాను ఇంకొంతకాలం అధ్యక్షుడిగా కొనసాగుతానని తన సొంత నిర్ణయాన్ని తెలియజేశారు. కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పి హనుమంతరావు చౌదరి, పిలుపుమేరకు, నిర్వహించిన ఈ అత్యవసర సమావేశంలో దాదాపు 40 మంది రంగస్థల కళాకారులు పాల్గొనగా, ఈ అత్యవసర సమావేశం అసంతృప్తిగా ముగిసింది.

About Author