చికిత్స కోసం సీఎం సహాయ నిధి కింద ఆర్థిక సాయం
1 min read

పత్తికొండ, న్యూస్ నేడు : గుండె చికిత్స కోసం పత్తికొండ పత్తికొండ పట్టణం ఎస్సీ కాలనీ కి చెందిన మాదిగ ఈశ్వరయ్యకు సీఎం సహాయ నిధి కింద స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ ఆర్థిక సాయం అందించారు. గుండెకు రక్తం సరఫరాయే కవాటాలలో బ్లడ్ క్లాట్ అవడంతో చికిత్స చేసుకోవడానికి తన దగ్గర ఆర్థిక స్తోమత లేనందువలన ఎమ్మెల్యే కి వారు వచ్చి వారి పరిస్థితిని విన్నవించుకున్నారు. దానికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ కింద సీఎంఓ ఆఫీస్ తో మాట్లాడి రెండు రోజుల్లో వారికి ట్రీట్మెంట్ కు అవసరమయ్యే 3,లక్షల 29 వేల రూపాయలను ఎల్ఓసి తెప్పించి ఈరోజు వారికి పత్తికొండ ఎమ్మెల్యే కార్యాలయం నందు తన చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది ఎల్ఓసి అందుకున్న బాధితులువ ఎమ్మెల్యే కి, ముఖ్యమంత్రి కి, డిప్యూటీ సీఎం కి, కృతజ్ఞతలు తెలియజేశారు.

