NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేఎంసీ వైద్యుడు డా. బాల రవితేజ ను అభినందించిన కేఎంసీ ప్రిన్సిపల్​

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:దక్షిణ కొరియా రాజధాని సీయోల్ లో ఈ నెల 24,25 తేదీలలో జరిగిన యూరాలజీ సదస్సులో కర్నూలు మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బాల రవితేజ ప్రోస్ట్రేట్ క్యాన్సర్ పై ప్రసంగించడం పట్ల అడిషనల్ డిఎమ్ఇ, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్. కె.చిట్టి నరసమ్మ  డాక్టర్ రవితేజను అభినందించడం జరిగింది. ఈ సీయోను సదస్సులో వివిధ దేశాల నుంచి 300 పైగా వైద్యులు పాల్గొనడం జరిగింది . ఇందులో కేవలం 16 మంది ని మాత్రమే ఫ్యాకల్టీగా ఎన్నుకోవడం జరిగింది. అందులో భారత దేశం నుండి ఒక్కరే ఎంపిక కావడం అది మన కర్నూల్ మెడికల్ కాలేజ్ నుంచి డాక్టర్ బాల రవితేజ ఎంపిక కావడం, ఇతర దేశాల్లో సైతం కర్నూలు మెడికల్ కాలేజీ వైద్యులు ఎంపిక కావడం అన్నది సంతోషదాయకమని  అన్నారు.అదే విధంగా త్వరలో ఇండోర్ లో జరగబోయే యురాలాజీ జాతీయ సదస్సులో “బ్లాడర్ క్యాన్సర్” పై మాట్లాడడానికి డా. రవితేజ కు అవకాశం రావడం కూడా గొప్ప విషయమని అభినందించారు.

About Author