ప్రతిభావంతులైన ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం
1 min read

పెద్ద ఎత్తున పాల్గొన్న మాల ఉద్యోగులు,నాయకులు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక అమీనా పేట ఏటిగట్టు మాల సంఘం భవనంలో ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో సన్మాన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జనవరి 26, 2026 సంవత్సరం కి గాను ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు అవార్డుల ప్రధాన ఉత్సవం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. దానిలో భాగంగా ఏలూరు జిల్లాలో పోలీస్ ఫెరైడ్ గ్రౌండ్ లో ఏలూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ,జాయింట్ కలెక్టర్ తదితర ఉన్న అధికారుల చేతుల మీదుగా ప్రతిభావంతులైన ఉద్యోగులకు అవార్డుల ప్రధానo చేయడం జరిగింది. వివిధ శాఖల నుండి అవార్డులు అందుకున్న మాల ఉద్యోగులకు ఏపీ మాల ఉద్యోగుల సంఘం ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున మాల ఉద్యోగులు హాజరై సన్మాన గ్రహీతలైన వై. సురేష్ బాబు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, కరుటూరి. జాన్ కెనడి ఏవో జిల్లా పరిషత్,తమలం. డయానా ఏఈ ఈ ఏపీ ట్రాన్స్కో , తేరా. ప్రసాద్ ప్రధానోపాధ్యాయులు, అంగులూరి. సర్వేశ్వరరావు ప్రధానోపాధ్యాయులు, ఆర్. విజయ కుమార్ ఏపీవో అడల్డ్ ఎడ్యుకేషన్, వై. సువర్ణ పాల్ కంప్యూటర్ అసిస్టెంట్. ఆడల్డ్ ఎడ్యుకేషన్ లకు పూల బొకేలు అందించి. శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి సన్మానించారు. డాక్టర్:బి.ఆర్ అంబేద్కర్ కలలు కన్న ఆశయాలను సార్ధకం చేసుకుంటూ మాలలు అన్ని రంగాలలో నిష్ణాతులుగా ఎదగాలని విచ్చేసిన వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దాసరి ఆంజనేయులు, రాష్ట్ర ఎస్సీ నాయకులు మెండం సంతోష్ కుమార్,దాసరి రమేష్ మరియు ఏపీ మాల ఉద్యోగ సంఘo జిల్లా,మండల, అధ్యక్ష , కార్యదర్శులు కోశాధికారులు తదితర మాల ద్యోగులు నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ప్రారంభం నుండి చివరి వరకు ఎన్ డి వివి ప్రసాద్ మాస్టర్ వ్యాఖ్యాతగా వ్యవహరించి పర్యవేక్షించారు.


