బొందిమడుగుల రమేష్ మాదిగ పై దాడి హత్య నిందితులను కఠినంగా శిక్షించాలి
1 min read

దళితులు ప్రశ్నిస్తే చంపేస్తారా
ఒక్క బొందిమడుగులను చంపితే వందమంది బొందిమడుగులలు పుట్టుకొస్తారు
జిల్లాలో వరుసగా దళిత నేతల హత్యలు
జాతీయ రాష్ట్ర ఎస్సీ కమిషన్ లు జిల్లాలో పర్యటించాలి
హొళగుంద తహసిల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్పిఎస్ నాయకుల నిరసన
తహసిల్దార్ నిజాముద్దీన్ కు మెమోరాండం సమర్పణ
హోళగుందన్యూస్ నేడు: శుక్రవారం సాయంత్రం బొందిమడుగుల గ్రామ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో దాడికి గురై కోలుకోలేక మృతి చెందిన ఎం ఆర్ పి ఎస్ ఎస్ బొందిమడుగుల టి ఎం రమేష్ మాదిగ హత్యపై ఎం ఆర్ పి ఎస్, ఎమ్మార్పీఎస్ దండోరా, దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసనను వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనితకు పంపించాలంటూ మెమోరాండం సమర్పించారు. సీనియర్ దళిత నాయకుడు చిదానంద, ఎమ్మార్పీఎస్ దండోరా ఆదోని డివిజన్ అధ్యక్షుడు పంచగుండగ వెంకటేష్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సూగూరు కెంచప్ప , అంబేద్కర్ వాది దళిత నాయకుడు కన్నారావు, బహుజన టైమ్స్ ఎండి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించిన నాయకులు ఎం ఆర్ పి ఎస్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టి యం రమేష్ మాదిగ పై దాడి, హత్యను తీవ్రంగా ఖండించారు. అగ్రవర్ణాల కుల దురహంకారానికి ఈ సంఘటన సాక్ష్యం అని, దళితులపక్షంగా పోరాడే నాయకులు, దళితుల హక్కుల కోసం, దళితుల ఆస్తుల రక్షణ కోసం మాట్లాడే నేతలను లక్ష్యంగా దళితేతరులు దాడులు చేస్తున్నారని ప్రాణాలు తీస్తున్నారని ధ్వజం ఎత్తారు. జిల్లాలో దళితుల గొంతుకగా అణగారిన వర్గాల హక్కుల గురించి మాట్లాడే నేతగా ముందు వరసలో ఉండే బొందిమడుగుల టిఎం రమేష్ మాదిగ హత్య దళిత సమాజంపై అగ్రవర్ణాల గొడ్డలిపోటు అని పేర్కొన్నారు. బలమైన నాయకులను హత్య చేస్తూ దళితులను భయభ్రాంతులకు గురిచేయాలని అణగారిన వర్గాల హక్కులను హరించాలని చూస్తే సహించేది లేదని ఒక్క బొందిమడుగుల రమేష్ మాదిగను చంపితే వందమంది బొందిమడుగుల రమేష్ మాదిగలు పుట్టుకొస్తారని హెచ్చరించారు. దళితులపై దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తుంటే పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉదాసీనంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఎస్సీ లపై దాడులు జరిగితే కేసులు పెట్టడానికి ఆలోచించే పోలీసులు దళితులపై జరుగుతున్న దాడులు హత్యలకు పరోక్షంగా కారకులవుతున్నారని ఆరోపించారు. దళితులపై వరుస దాడులతో బలమైన నాయకత్వం ప్రాణాలు పోతున్నాయని ఈ విషయంపై జాతీయ ఎస్సీ కమిషన్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జిల్లాలో పర్యటించి దళితులపై దాడులు జరిగిన హత్యలపై విచారణ సమీక్షా సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బొందిమడుగుల రమేష్ మాదిగ హత్యకు పాల్పడిన దుండగులను గుర్తించి ఎస్సీ ఎస్టీ హత్య కేసు నమోదు చేసి నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, న్యాయం జరిగే వరకు సంఘాలు వేరైనా దళిత నేతలు అందరూ ఏకతాటిపై నిలిచి మరోసారి దళితులపై దాడులు జరగకుండా దళిత నేతల హత్యలు పునరావృతం కాకుండా సమిష్టిగా ముందుకు కదలి పోరాటం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా నాయకులు ఎం మహదేవుడు, ఎం ఆర్ పి ఎస్ హోలగుంద మండల కన్వీనర్ కోగిల తోట వీరేష్. కోగిల తోట గోవర్ధన్. ఎం ఆర్ పి ఎస్ ఎస్. మండల అధ్యక్షుడు చిన్నహ్యట ప్రకాష్, ఎమ్మార్పీఎస్ నాయకులు ముద్దటమాగి నాగేంద్ర, జనసేన వీరేష్,సినిమా మంగన్న, భాస్కర్. ఎర్రి స్వామి, లోకేష్ ఆదోని డివిజన్ ప్రధాన కార్యదర్శి వై రంగప్ప, కే హనుమంతు, వరాల మల్లయ్య, హెచ్ మల్లయ్య, తప్పెట మల్లికార్జున, శివప్ప, కోగిల తోట బసవరాజ్, హోళగుంద గ్రామ అధ్యక్షుడు మృత్యుంజయ, శివి ,సిద్ధ,ఎల్లప్ప. తదితరులు పాల్గొన్నారు.


