NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈనెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో అంగన్వాడీలు

1 min read

ఐసిడిఎస్ కార్యాలయ అధికారులకు సమ్మె నోటీసు అందించిన సిఐటియు ఏఐటియుసి కార్మిక సంఘం నాయకులు.

పత్తికొండ, న్యూస్​ నేడు : ఈనెల 12వ తారీఖున దేశవ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీలు పాల్గొంటారని సిఐటియు మండల కార్యదర్శి రవిచంద్ర తెలిపారు. ఈ మేరకు తాము దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నందున విధులకు హాజరు కాలేమని పత్తికొండ ఐసిడిఎస్ సెక్టార్ పరిధిలోని సిఐటియు అంగన్వాడి కార్యకర్తలు స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం నందు సోమవారం ఐసిడిఎస్ సూపర్వైజర్ త్రివేణి కి సిఐటియు ఎఐటియుసి నాయకులు సమ్మె నోటీసు అందించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, సిపిఐ మండల కార్యదర్శి కారుమంచి, మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా నిర్వహించే 12వ తారీకు సమ్మెలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.అంగన్వాడి టీచర్లను ఆయాలను నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీలకు సంబంధించిన అనేక డిమాండ్లను పొందుపరిచామని, నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ప్రాజెక్ట్ అధ్యక్షురాలు చిట్టెమ్మ, గోపాల్, ఏఐటీయూసీ కాంతమ్మ,, తదితరులు పాల్గొన్నారు.

About Author