అచ్చమ్మ పేరంటాల తల్లి అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే
1 min read
సుమారు 50 ఏళ్లుగా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయం
69వ వార్షికోత్సవంలో వేలాదిగా పాల్గొన్న భక్తులు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దెందులూరు మండలం, గాలయగూడెం గ్రామం నందు జరుగుచున్న శ్రీ అచ్చమ్మ పేరంటాలు తల్లి సంబరాలలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) హాజరైన అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి తోపాటు ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్ , మాజీఈ ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 50 సంవత్సరాలుగా అచ్చమ్మ పేరంటాలు ఉత్సవాలు కమిటీ వారు ఎంతో ప్రతిష్టాత్మక నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర నిర్మల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మ్రొక్కులు తీర్చుకుంటారన్నారు. ఏలూరు జాతర సందర్భంగా పలు రాష్ట్రాల నుండి భక్తులు తరలి రావడం అచ్చమ్మ పేరంటాలు ఆశీస్సులు అందుకొని తీర్థప్రసాదాలు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.


