ఉద్యోగ,ఉపాధ్యాయులకు కలుగుతున్న ఆర్థిక నష్టం గురించి అసెంబ్లీ లో ప్రస్తావించండి
1 min read

యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి అబ్దుల్ లతీఫ్
ప్యాపిలి న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు యూటీఎఫ్ ప్యాపలి మండల శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ ,ఉపాధ్యాయులకు జరుగుచున్న ఆర్థిక నష్టం పై ఫిబ్రవరి 11 వ తేదీ నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి ,సమస్య పరిష్కరించాలని యూటీఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి అబ్దుల్ లతీఫ్ డోన్ నియోజక వర్గ శాసన సభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు.పిఆర్సీ కమిటీ తక్షణమే నియమించాలని,ఆలోపు 29% ఐఆర్ ప్రకటించాలని,మెమో 57 ప్రకారం 2004 కి ముందు నియమితులైన ఉద్యోగులందరికీ పాత పెన్షన్ అమలు చేయాలని,మెడికల్ బిల్లులో జరుగుచున్న జాప్యాన్ని అరికట్టాలని,4డిఎ లు పెండింగ్ లో ఉండగా కేవలం ఒక డిఎ మాత్రమే దీపావళి కి ఇచ్చారని ,ఇంకా దాదాపు 30 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని వీటి గురించి కూడా అసెంబ్లీ లో తప్పక ప్రస్తావించాలని చెప్పగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని ఆయన తెలియచేశారు.కార్యక్రమంలో యూటీఎఫ్ సీనియర్ నాయకులు మాణిక్యం శెట్టి,రామ మూర్తి,ప్యాపలి మండల సహాద్యక్షులు రహీం,జిల్లా కౌన్సిలర్ అమీర్,వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

