రైతుల భూమి హక్కులను కాపాడడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం
1 min read

ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి
ప్యాపిలి న్యూస్ నేడు: రైతుల భూమి హక్కులను కాపాడడమేక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, భవిష్యత్తులో కూడా రైతు సంక్షేమానికి మరిన్ని సంస్కరణలు తీసుకురావడం జరుగుతుందని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి తెలిపారు.ఈసందర్భంగా మంగళవారం ప్యాపిలి మండల పరిధిలోని వెంగళంపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో భాగంగా డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొని రైతు సంక్షేమంపై కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులకు నూతన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ ఫోటోతో ముద్రించబడిన పాత పాసుపుస్తకాల్లో అనేక సాంకేతిక లోపాలు ఉండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వాటన్నింటినీ సరిదిద్దుతూ ఇప్పుడు పూర్తిగా పారదర్శకమైన విధానంలో నూతన పాసుపుస్తకాలను రూపొందించామని చెప్పారు.ఈ నూతన పట్టాదారు పాసుపుస్తకాలపై కేవలం ప్రభుత్వ రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్ (QR Code) మాత్రమే ఉంచడం ద్వారా ఎలాంటి రాజకీయ చిహ్నాలు లేకుండా రూపొందించామని, వెబ్ ల్యాండ్ డేటాతో అనుసంధానం చేయడం వల్ల భూమి వివరాలపై సంపూర్ణ నమ్మకాన్ని రైతులకు కల్పించనున్నాయని పేర్కొన్నారు.రీ-సర్వే పూర్తయిన రాష్ట్రవ్యాప్తంగా 6,688 గ్రామాల్లోని సుమారు 21.80 లక్షల మంది రైతులకు ఈ పాసుపుస్తకాలను స్థానిక గ్రామ సభల ద్వారా రెవెన్యూ సిబ్బంది,అందజేయనున్నారని తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తం పర్యవేక్షణతో, నిబంధనలకు అనుగుణంగా అమలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరావు యాదవ్, ఆర్డీవో నరసింహిలు, తాసిల్దార్ భారతి, మాజీ సర్పంచ్ జయశిలమ్మ, టిడిపి సీనియర్ నాయుకులు లక్కసాగరం లక్ష్మి రెడ్డి, తెదేపా మండల ఇన్చార్జి ఎద్దుల దొడ్డి ప్రభాకర్ రెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకులు ఖాజా ఫీర్, తేదేపా మండల కన్వీనర్ సుదర్శన్, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, మాజీ ఎంపిటిసి గోల్ల రామ్మోహన్ యాదవ్,ఎస్ఐ నాగార్జున,గ్రామ యువ నాయుకులు శంకర్, రాంబాబు, ఏనుగమర్రి రామకృష్ణ, రాము, పెద్ద పూజర్ల ప్రసాద్ రెడ్డి,కొదండ రామయ్య,విఆర్ఓ శ్రీనివాసులు, సోమశేఖర్ నాయుడు, సునీల్ వంశీ,హనుమన్న , శివానంద, సూరిబాబు, రంగస్వామి, తదితరులు అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

