NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి

1 min read

సి.పి.ఎం పార్టీ డిమాండ్

ప్యాపిలి న్యూస్ నేడు: 2006లో తీసుకుని వచ్చిన మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని సిపిఎం పార్టీ నాయకులు ఎస్.ఎ. చిన్న రహిమాన్ , సిఐటియు నాయకులు షేక్. హుస్సేన్, సి. మధు ఆర్. శివ ప్రతాప్ డిమాండ్ చేశారు. ఈసందర్భంగా మంగళవారం ప్యాపిలి మండలంలోని జలదుర్గం గ్రామ పంచాయతీ సచివాలయంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సచివాలయం కార్యదర్శి సుబ్బమ్మ కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవసాయ కార్మిక వ్యతిరేక రైతాంగ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నదని నిరంతరం ధరలు పెరుగుతుంటే అరికట్టలేక ప్రభుత్వం ఉన్న హక్కులను హరించి వేస్తున్నది ఒకపక్క ధరల పెరుగుదల మరోపక్క ఉపాధి లేకపోవడం వలస గ్రామీణ పేదలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఈ కార్యక్రమంలో అవకు మల్లన్న , గోవర్ధనగిరి చంటి, గుండాల భాష, కామంచి శీను, రహమద్బీ తదితరులు పాల్గొన్నారు.

About Author