చర్యలు తీసుకోవాలి… డాక్టర్ సుధీర్
1 min read
రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగిస్తున్నారా..
నందికొట్కూరు, న్యూస్ నేడు: రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగిస్తున్నారా అని వైసీపీ నందికొట్కూరు ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ ప్రశ్నించారు.మంగళవారంనందికొట్కూరు పట్టణంలో పట్టణ పోలీస్ స్టేషన్ నందు కల్తీ నెయ్యి అంశంపై,సీట్ చార్జ్ షిట్ కు విరుద్ధంగా మాజీ సీఎం వైఎస్ జగన్,వైవి సుబ్బారెడ్డి,భూమన కరుణాకర్ రెడ్డి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి తప్పుడు,అపవాదులు కలిగిన పోస్టర్లు ఏర్పాటు చేసి ప్రజల్లో శాంతి భద్రతలకు భంగం కల్గించే విధంగా ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్ లో పట్టణ ఎస్సై చంద్రశేఖర్ కు వైసీపీ నాయకులతో కలిసి డాక్టర్ సుధీర్ ఫిర్యాదు చేశారు.మాజీ మంత్రి అంబటి,పార్టీ ఆఫీస్ పై టీడీపీ రౌడీ మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని డాక్టర్ సుధీర్ అన్నారు.పట్టపగలు కర్రలు,రాళ్ళతో రోడ్లపైకి టీడీపీ రౌడీ మూకలు వస్తే పోలీసులు ఏమి చేస్తున్నారని,చంద్రబాబు మళ్ళీ ఫ్యాక్షన్ ను ప్రోత్సహిస్తున్నారా అని అన్నారు.వైసీపీ కార్యాలయంలో టీడీపీ నేతలు దాడులు చేస్తుంటే పోలీసులు పేక్షక పాత్ర పోషిస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వం రాష్ర్టంలో డైవర్సన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారే తప్పా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు ఏమి చేస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు.తర్వాత పార్టీ కార్యాలయంలో ఛలో పోతులపాడు పోస్టర్లను విడుదల చేశారు.

