NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జెండర్ కార్యక్రమాలపై అవగాహన .. శిక్షణ

1 min read

కర్నూలు, న్యూస్ నేడు:  స్థానిక ఏ క్యాంపు లోని ఉద్యానభవన్ సమావేశపు హాలు నందు జెండర్ కార్యక్రమాలపై అవగాహన మరియు శిక్షణ, ఏపీఎం/సీసీలకు ప్రాజెక్టు యొక్క పథకాలపై సమీక్షా సమావేశాన్ని  నిర్వహిస్తున్న పథక సంచాలకులు డిఆర్డిఏ- సెర్ప్ శ్రీ రమణారెడ్డి  ఈ కార్యక్రమంలో ప్రధానంగా జెండర్ కార్యక్రమాల లో భాగంగా సామాజిక సమస్యలపై అవగాహన కలిగి  పరిష్కరించే నైపుణ్యం కలిగి ఉండే విధంగా జిల్లా యాక్షన్ కమిటీ,మండల యాక్షన్ కమిటీ , గ్రామ సమాఖ్యలను బలోపేతం చెయ్యాలని, జెండర్ రిసోర్స్  సెంటర్స్  యొక్క విధులు, బాధ్యతలు, రికార్డు ల నిర్వహణ, మండల స్థాయిలో సీఆర్పీలు జెండర్ కార్యక్రమాలను ఎజెండా గా చేర్చి వివరించాలని తెలియజేయడమైనదిసెర్ప్ ఆధ్వర్యంలో మూడు మండలాలైనటువంటి ఓర్వకల్లు దేవరకొండ  ఆస్పరి నందు మండలానికి ఐదు గ్రామాలు చొప్పున మొత్తం 15 గ్రామాలలో  ఫుడ్ బాస్కెట్ నిర్వహణపై సప్లై చేయవలసిన కమోడిటీస్, సర్వే నిర్వహించి త్వరగా పూర్తి చేయాలని తెలియజేయడమైనది అలాగే ఓర్వకల్లు మండలంలో గుర్తించబడిన 10 న్యూట్రి ఎంటర్ప్రైజెస్ నిర్వహణ పై సమీక్ష చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో శ్రీమతి ఎల్. విజయలక్ష్మి సిఐ మహిళా పోలీస్, ఐసిడిఎస్ సిబ్బంది, డిపిఎం (జీవనోపాదులు & హెచ్ డీ) శ్రీమతి నరసమ్మ , డిపిఎం (సిబివో ఫైనాన్స్) శ్రీ రెహమాన్ , డిపిఎం (ఐబి & ఫైనాన్స్) శ్రీ నవీన్ , డిపియంయు సిబ్బంది, మండల స్థాయి ఎపియం/సీసీ లు తదితరులు పాల్గొనడం జరిగినది.

About Author