NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

20 లక్షల 62 వేల రూ.సీఎంఆర్ఎఫ్  చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:  పత్తికొండ నియోజకవర్గంలోని  పత్తికొండ, మద్దికేర, తుగ్గలి, క్రిష్ణగిరి, వెల్దుర్తి మండలాలకు చెందిన 32 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్ , కర్నూల్ గ్రంథాలయ చైర్మన్ బుగ్గలు నాగేంద్ర, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిని వెంకటరాముడు తో కలిసి సీఎంఆర్ఎఫ్  చెక్కులు పంపిణీ చేశారు. ఈ మేరకు బుధవారం పత్తికొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో  32 మంది లబ్దిదారులకు 20 లక్షల 62 వేల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. చెక్కులు అందుకున్న వారు ఎమ్మెల్యే  కే.ఈ.శ్యామ్ కుమార్  ముఖ్యమంత్రి చంద్రబాబుకు  కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే   మాట్లాడుతూ, సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఒక వరం అని కష్టకాలంలో కుటుంబానికి పెద్దకొడుకుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉంటున్నారని తెలిపారు పేదలు అనారోగ్యానికి గురైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసి ఆ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారన్నారు.  ఎన్​టీఆర్​ వైద్య సేవ వర్తించని వారికి కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందుతుందన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి,ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్   కి కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author