NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కు పంపిణీ.. 

1 min read

నలకదొడ్డి టిడిపి గ్రామ అధ్యక్షుడు చొరవతో చెక్కు తీసుకున్న బాధ్యుడు బోయ అంజి 

పత్తికొండ, న్యూస్​ నేడు:  అనారోగ్యరీత్యా బాధపడుతున్న, హాస్పిటల్ ఖర్చులకోసం కోసం అప్పులు చేసి, ఇబ్బంది పడుతున్న సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సాయం అందుతుందని స్థానిక ఎమ్మెల్యే కే ఏ శ్యాం కుమార్ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్తికొండ మండల పరిధిలోని నలకదొడ్డి గ్రామ అధ్యక్షుడు బత్తిన రాజశేఖర్ చొరవతో అదే గ్రామానికి చెందిన బోయ అంజి అనారోగ్య రీత్యా  బాధపడుతూ సొంత డబ్బులతో హాస్పిటల్లో చూపించుకునందుకు ఆయనకు ఎమ్మెల్యే ద్వారా 44 వేల రూపాయలు చెక్కు అందుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే కెఈ.శ్యాంబాబు,టిడిపి తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిన లోకనాథ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామలింగప్ప, భరత్ కుమార్,రవితేజ తదితరులు పాల్గొన్నారు.

About Author